పెళ్లి కబురు చెప్తారా?

- Advertisement -
Allia Bhatt and Ranbir Kapoor

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ ప్రేమికులు అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. వీరి పెళ్లి గురించి చాలాకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. “మా నాన్న బ్రతికి ఉంటే ఈపాటికి మేం పెళ్లి చేసుకునేవాళ్లం,” అని ఇటీవల రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఈ లవ్ జంట జోధాపూర్ కి వెళ్ళింది. సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ పుట్టిన రోజు. బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం అక్కడికి వెళ్లారు.

పనిలో పనిగా పెళ్లి వేదికని కూడా ఖరారు చేసుకునేందుకు అన్వేషణ మొదలు పెట్టారని బాలీవుడ్ మీడియా రాస్తోంది. రణబీర్ 39లోకి అడుగుపెడుతుండగా, అలియాకి 30 ఏళ్ళు. ఇంకా ఆలస్యం చెయ్యకూడదని రణబీర్ తల్లి నీతూ కపూర్ అంటున్నారట. అందుకే, ఈ ఏడాది క్యాలెండర్ ముగిసేలోపే వీరి పెళ్లి కబురు ఉంటుంది అని అంటున్నారు.

అలియా తెలుగులో ఇప్పటికే రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఆమె హిందీలో కూడా షూటింగ్స్ అన్ని పూర్తి చేసుకుంటోంది. అంటే ఇక పెళ్ళి ముహూర్తం కుదిరితే చాలు.

రణబీర్ కపూర్, అలియా కుటుంబాలు ఇప్పటికే వీరి పెళ్లికి అంగీకరించాయి.

 

More

Related Stories