తొందర్లోనే ముహూర్తం ఉంటుంది!

- Advertisement -
Ranbir Kapoor and Alia Bhatt

మరోసారి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు హీరో రణబీర్ కపూర్. తన తండ్రి రిషి కపూర్ నటించిన చివరి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని రణబీర్ కపూర్ ప్రోమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో అలియా భట్ తో పెళ్లి గురించి పెదవి విప్పాడు.

“ఇలా మీడియా ఇంటర్వ్యూలలో ముహూర్తం గురించి బయట పెట్టలేను. కానీ, చాలా త్వరలోనే పెళ్లి వేడుక ఉంటుంది. అంతవరకు చెప్పగలను. తేదీ ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పలేను. అలియా, నేను ఇప్పటికే కపుల్స్ గానే ఉన్నాం. పెళ్లి అనేది లాంఛనమే. అది కూడా త్వరలోనే ఉంటుంది,” రణబీర్ కపూర్ చెప్పాడు.

అలియా భట్ బాలీవుడ్ లో, హాలీవుడ్ లో కొత్త సినిమాలు సైన్ చేస్తోంది. దాంతో, పెళ్లి వాయిదా పడింది అని పుకార్లు మొదలయ్యాయి. కానీ అలాంటిదేమి లేదని రణబీర్ మాటతో అర్థమైంది. పెళ్లి తర్వాత కూడా అలియా నటిస్తుందట.

మరోవైపు, అలియా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విషయంలో సంతృప్తిగా లేదనే పుకారు నడుస్తోంది. ఆమె దర్శకుడు రాజమౌళిని ఇన్ స్టాగ్రామ్లో అన్ ఫాలో చేసిందని అంటున్నారు. కానీ, ఆమె తాజాగా ‘ఆర్ ఆర్ ఆర్’ కలెక్షన్ల గురించి ఒక పోస్ట్ పెట్టింది.

 

More

Related Stories