రణబీర్, అలియా నెట్ వర్త్ ఎంతంటే!

- Advertisement -

రణబీర్ కపూర్, అలియా భట్ ఓ జంటగా మారారు. ఏప్రిల్ 14న వీరి వివాహం ముంబైలో జరిగింది. ఇద్దరూ పేరొందిన సూపర్ స్టార్స్. రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటాడు. అలియా భట్ సినిమాకి 5 నుంచి 8 కోట్లు తీసుకుంటుంది.

ఇక ఇద్దరూ బ్రాండ్స్ తో బాగా సంపాదిస్తారు. ఒక్కో యాడ్ కి అలియా 2 కోట్లు అందుకుంటుంది. రణబీర్ కపూర్ 8 కోట్లు తీసుకుంటాడు ఒక్కో యాడ్ కి. సంపాదన పరంగా రణబీర్ దే పైచేయి. ఐతే, ఆస్తుల పరంగా అలియానే టాప్.

బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం అలియా భట్ కి ముంబైలో, లండన్ లో చాలా ఆస్తులున్నాయట. ఆమె నెట్ వర్త్ దాదాపు 500 కోట్లు ఉంటుందట. ఇక రణబీర్ కపూర్ నెట్ వర్త్ … 350 కోట్లు ఉంటుందట. ఇద్దరికీ కలిపి 850 కోట్లు.

ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో అత్యధిక నెట్ వర్త్ ఉన్న జంటలల్లో ఒకరు. ఇద్దరికీ లాంగ్ కెరీర్ ఉంది. ఇంకా ఎన్నో కోట్లు వెనకేసుకుంటారు.

 

More

Related Stories