కొత్త ఇంటి పనులతో బిజీ!


అలియా భట్ గర్భవతి. త్వరలోనే వారింట్లో ఒక బాబో, పాపో సందడి చేస్తారు. అలియా భట్, రణబీర్ కపూర్ ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు ఇద్దరూ లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఇంట్లోనే కాపురం పెట్టారు. ఐతే, తమ బేబీతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారట.

తన తండ్రి రిషి కపూర్ కొన్న ఇంటిని పడగొట్టి కొత్తగా కట్టిస్తున్నాడు రణబీర్ కపూర్.

తాజాగా అలియా భట్, రణబీర్ కపూర్ కన్ స్ట్రక్ట్ అవుతున్న ఇంటికి వెళ్లి దగ్గరుండి అన్ని పనులు చూసుకోవడం, ఆర్కిటెక్టులకు సూచనలిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. కొత్త ఇల్లు తమ అభిరుచులకు అనుగుణంగా కట్టించుకుంటున్నారట అలియా, రణబీర్. మీడియాతో కూడా ముచ్చటించింది ఈ జంట.

“ఇంకా చాలా వర్క్ ఉంది. అప్పుడే కాదు గృహ ప్రవేశం,” అని రణబీర్ కపూర్ మీడియాకి తెలిపాడు.

మరోవైపు, ‘బ్రహ్మాస్త్ర’ విజయంతో ఈ జంట ఇంకా ఆనందంగా ఉంది. త్వరలోనే ‘బ్రహ్మాస్త 2’ కూడా మొదలు కానుంది. ఇందులో రణబీర్ తో కలిసి హృతిక్ రోషన్ కూడా నటిస్తాడట.

Advertisement
 

More

Related Stories