నేడు ఆలియా నిశ్చితార్థమా?

అలియా భట్, రణబీర్ కపూర్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. “కరోనా సంక్షోభం” లేకుండా ఉంటే ఇప్పటికే పెళ్లి కూడా జరిగిపోయేది అని ఇటీవలే రణబీర్ చెప్పాడు.

ఇక తాజాగా … అలియా భట్, రణబీర్ కపూర్ కుటుంబాలు రాజస్థాన్ వెళ్లాయి. మొత్తం ఫ్యామిలీ సభ్యులందరూ న్యూ ఇయర్ వెకేషన్ కి రాజస్థాన్ వెళ్లినట్లు ఇప్పటికే మీడియాలో వార్తలు, ఫోటోలు వచ్చాయి. ఐతే, ఇది వెకేషన్ కాదు అని… ఎంగేజ్ మెంట్ అకేషన్ అని హాట్ హాట్ గుసగుస.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ రోజు (డిసెంబర్ 30) రాజస్థాన్లోని రత్నంబోర్ నేషనల్ పార్క్ లో వీరి ఎంగేజ్మెంట్ జరిగే అవకాశం ఉందట. అలియా భట్, రణబీర్ కలిసి ఎన్నోసార్లు వెకేషన్ కెళ్లారు. కానీ ఈసారి రణబీర్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, అలియా తల్లితండ్రులు కూడా వారితో కలిసి వెకేషన్ కెళ్ళడంతో ఈ ప్రచారం జరుగుతోంది.

More

Related Stories