అలియాతో మొదలెట్టించిన రాజమౌళి టీం

Alia Bhatt


చాలామంది రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీలో కింగ్ అనుకుంటారు. కానీ, నిజానికి రాజమౌళి ముందు ఎవరైనా దిగదుడుపే. ఆయన తన సినిమాలకు హైప్ తెచ్చుకునే పద్దతి వేరుగా ఉంటుంది. ‘బాహుబలి’ సినిమాలకు ఆయన సోషల్ మీడియాని వాడుకున్న తీరు ఒక కేసు స్టడీ. ఇప్పుడు “ఆర్ ఆర్ ఆర్”కి అలాగే కూడా మొదలు పెట్టారు.

మొన్నటివరకు రిలీజ్ విషయంలో సైలెంట్ గా ఉన్న “ఆర్ ఆర్ ఆర్” టీం ఇప్పుడు రోజూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఎందుకంటే రిలీజ్ కి కౌంట్ డౌన్ షురూ అయింది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే బాలీవుడ్ లో ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అలియా భట్ తో ప్రొమోషన్ షురూ చేయించారు.

“ఆర్ ఆర్ ఆర్” టీంకి చెందిన హ్యాండిల్ నుంచి అలియా ముచ్చటించే విధంగా ప్లాన్ చేశారు. అంటే, సోషల్ మీడియాలో ప్రచారానికి బెల్ మోగింది.

ఈ సినిమాకి ఇప్పుడు హైప్ చాలా ముఖ్యం. రాజమౌళి సినిమాకి ప్రత్యేకంగా పబ్లిసిటీ ఎందుకు అనుకోవడం తప్పు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో జనం థియేటర్ కి వస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. తెలుగునాట ఆ సమస్య ఉండదు. కానీ నార్త్ ఇండియా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనం థియేటర్ల వైపు రావాలి. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎటువంటి సినిమాల విడుదల సందడి లేదు. అక్టోబర్ 13న ‘ఆర్ ఆర్ ఆర్’ థియేటర్లలోకి రానుంది. అంటే గట్టిగా మూడు నెలలే ఉంది రిలీజ్ కి. ఈ లోపు పరిస్థితులు చక్కబడాలి. అందుకే, ఈ సినిమాకి మునుపటి కన్నా ఎక్కువ హైప్ కావాలి. ఆ ప్రయత్నంలోనే ఉంది “ఆర్ ఆర్ ఆర్ ఆర్” టీం.

Alia Bhatt as Sita in RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ మూవీకి దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెలలో మొదటి సాంగ్ విడుదల కానుంది.

 

More

Related Stories