- Advertisement -

అలియా భట్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కి కరోనా సోకింది. రణబీర్ ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నాడు. అలియా భట్ కి నెగెటివ్ అని తేలింది. ఆమె ఇప్పటికే సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఐతే, రణబీర్ కి పూర్తిగా తగ్గేంతవరకు ఆమె ముంబై వదిలి బయటికి రాదనీ, ఆమెకి సంబంధించిన “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతుంది అని జరిగిన ప్రచారం తప్పే.
షూటింగ్ కి రెడీ అని చెప్పింది. డేట్స్ కూడా ఇచ్చేసింది. ఇక రాజమౌళి షూటింగ్ చెయ్యడమే ఆలస్యం. ఇప్పటికే ఈ సినిమాలోని అలియా భట్ మొదటి లుక్ విడుదలయింది. అలాగే, ఈ సినిమా విడుదల తేదీ కూడా మారట్లేదు. అక్టోబర్ 13నే రిలీజ్ చెయ్యనున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకొంది.