
అలియా భట్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే చిత్రం… “ఆర్ ఆర్ ఆర్”. ఈ సినిమాలో ఆమె సీతగా నటించింది. అల్లూరి సీతారామ రాజు భార్య “సీత” పాత్ర అది. ఇక ఇప్పుడు రామాయణంలో “సీత”గా నటించే అవకాశం వస్తే మాత్రం ఆమె చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదట.
ఆమె భర్త రణబీర్ కపూర్ రాముడిగా, ఆమె సీతగా నిర్మాత మధు మంతెన “రామాయణం” చిత్రం భారీ ఎత్తున తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమా చేసేందుకు అలియా భట్ ఆసక్తి చూపింది. కానీ ఇప్పుడు డేట్స్ లేవు అని చెప్తోందట. అందుకే, అలియా భట్ ఈ సినిమాలో నటించే అవకాశం లేదు అని బాలీవుడ్ మీడియా వార్తలు.
నిజంగా డేట్స్ లేవా లేక చెయ్యడం ఇష్టం లేకపోవడం వల్ల అలా చెప్తోందా?
ఇటీవల “ఆదిపురుష్” సినిమాలో కృతి సనన్ సీతగా నటించింది. కానీ, ఆ సినిమా అపజయం పాలు అయింది. పైగా రామాయణాన్ని వక్రీకరించారు అనే విమర్శలు టీం మొత్తం ఎదుర్కొంది. అందుకే అలియా భట్ భయపడుతున్నట్టు ఉంది.