ట్విన్స్ కాదు …అలియా క్లారిటీ

- Advertisement -

తనకు ట్విన్స్ పుట్టబోతున్నారు అనే ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చింది. మొన్నామధ్య ఒక ప్రొమోషన్ ఈవెంట్ లో రణబీర్ పాల్గొన్నాడు. ఒక అబద్దం, రెండు నిజాలు చెప్పాలని యాంకర్ అడిగితే అందులో తమకు కవలలు కలగబోతున్నారు అని సమాధానం ఇచ్చాడు. ఐతే, అది అబద్దమా, నిజమా అని చెప్పాడు. ఆయన సమాధానం వైరల్ అయింది.

తాజాగా అలియా క్లారిటీ ఇచ్చింది. “రణబీర్ జోక్ చేశాడు. ఆయన జోక్ ని జనం ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు. మార్కెట్ లో వార్తలు లేనట్లు ఉన్నాయి. అందుకే, ట్విన్స్ మాట అంతగా వైరల్ అయింది,” అని అలియా సమాధానం ఇచ్చింది.

ఒక్కరే పుట్టబోతున్నారు అని చెప్పింది. ఈ విషయంలో ఊహాగానాలు, పుకార్లు వద్దు అని మీడియాని వేడుకొంది. రణబీర్, అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు.

పెళ్ళికి ముందే ఆమె అనేక చిత్రాలు పూర్తి చేసింది. అవన్నీ ఇప్పుడు వరుసగా విడుదల అవుతున్నాయి. దాంతో, ఆమె వాటిని ప్రమోట్ చేస్తోంది.

 

More

Related Stories