
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అద్భుతమైన నటి. నటనలో చించేస్తుంది. స్టార్ డమ్ కూడా ఎక్కువే. అయినా కూడా రాజమౌళి సినిమాల్లో నటించాలన్న అభిలాషతో “ఆర్ ఆర్ ఆర్”లో చిన్న పాత్ర పోషించేందుకు అంగీకరించింది. పేరుకు ఆమె హీరోయిన్ అన్న మాటే కానీ సినిమాలో కనిపించేది చాలా తక్కువ సమయం.
ఒక విధంగా చెప్పాలంటే అతిథి పాత్ర. ఇలాంటి రోల్స్ కోసం ఏ అగ్ర హీరోయిన్ కూడా ప్రొమోషన్ కి టైం కేటాయించదు. కానీ అలియా వేరు. పూర్తిగా కమిట్ మెంట్ ఉన్న భామ. ఈ సినిమా కోసం పబ్లిసిటీ చేస్తోంది. అంతేకాదు, రెండు రోజుల గ్యాప్ లో ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అన్ని నగరాల్లో సినిమా ప్రెస్ మీట్ లకు అటెండ్ అయింది.
ఒక సినిమా ఒప్పుకుంటే… దానికి న్యాయం చెయ్యడమే ప్రొఫెషనిలిజం! ఆమె తలుచుకుంటే.. హిందీ సినిమాల కమిట్ మెంట్స్ ఉన్నాయని ప్రొమోషన్ కి దూరంగా ఉండొచ్చు. లేదూ బాలీవుడ్ వరకే ప్రొమోషన్ కి పరిమితం అవ్వొచ్చు. కానీ ఈ సినిమా మీద ఇష్టం, రాజమౌళి దర్శకత్వం అంటే అభిమానంతో ఆమె కమిటెడ్ గా ప్రొమోషన్ చేస్తోంది.
అలియాని చూసి మన తెలుగు హీరోయిన్లు చాలా నేర్చుకోవాలి. నయనతార వంటి హీరోయిన్లు ఐతే తమ సినిమాల ప్రొమోషన్ లకు రానే రారు.