ఆర్ఆర్ఆర్ కన్నా ముందు గంగూబాయి!

Gangubai

ముంబైలో మళ్ళీ సినిమా షూటింగులు మొదలవుతున్నాయి. బాలీవుడ్ పెద్ద సినిమాలు చిత్రీకరణకు రెడీ అవుతున్నాయి.

షూటింగ్ లో చేరేందుకు అలియా భట్‌ కూడా సిద్ధంగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో మహాదర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం… ‘గంగూబాయి’. జూన్ 15 నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నారు. అలియా భట్ డేట్స్ ఇచ్చింది. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాతే ఆమె రాజమౌళి తీసే “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ లో పాల్గొంటుంది. ఎందుకంటే, రాజమౌళి ఇంకా కొత్త షెడ్యూల్ గురించి ప్లాన్ చెయ్యలేదు.

అన్ని అనుకూలిస్తే, వచ్చే నెలలో “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నాడట. అలియా ఈ సినిమాలో సీత అనే పాత్ర పోషిస్తుంది. రామ్ చరణ్ కి భార్య పాత్ర.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారు. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు.

 

More

Related Stories