అలియా భట్ సొంత ప్రొడక్షన్

Alia Bhatt

హీరోయిన్ అలియా భట్ కూడా సినిమా నిర్మాతగా మారింది. “ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్” పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించింది. “డార్లింగ్స్” అనే టైటిల్ తో తొలి సినిమాని నిర్మిస్తోంది.

జస్మిత్ అనే లేడీ డైరెక్టర్ ని పరిచయం చేస్తోంది. ఈ సినిమాలో ఆమె కూడా నటిస్తోంది. షెఫాలీ షా, విజయ్ వర్మ (‘ఎం సి ఏ’ సినిమాలో విలన్), రోషన్ మేధ్య్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ఈ రోజు ప్రకటించింది అలియా భట్.

తొలి సినిమాకి తన ఫెవరెట్ హీరో షారుక్ ఖాన్ తో చేతులు కలిపింది. షారుక్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నిర్మాణంలో పార్టనర్. అంటే డబ్బులు అలియా భట్ వి, కానీ ప్రొడక్షన్ అంతా షారుక్ టీం చూసుకుంటుంది. అలియా భట్ ఇకపై తన మనసుకు నచ్చే చిన్న చిత్రాలు నిర్మిస్తుంది.

“ఆడవాళ్ళని చులకన చెయ్యడం మీ ఆరోగ్యానికి చాలా హానికరం,” అని హెచ్చరిస్తూ చిన్న వీడియోని విడుదల చేశారు. ఇది ఈ సినిమా కాన్సెప్ట్. ఇది కామెడీ మూవీ. కానీ కొంచెం డార్క్ కామెడీనట.

More

Related Stories