అలియా మళ్ళీ ఏప్రిల్లో వస్తుందట

Alia Bhatt

అలియా భట్ 10 రోజుల పాటు షూటింగ్ చేసి మళ్ళీ ‘ఆర్ఆర్ఆర్’ సెట్ కి రాకపోవడంతో ఆమె పాత్రని కుదించారని గాసిప్స్ మొదలయ్యాయి. కానీ ఆమె పాత్ర మారలేదు, ఆ రోల్ లెంగ్త్ తగ్గలేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షెడ్యూల్స్ మారాయి. అంతే. ఆమె మళ్ళీ ఫిబ్రవరిలో షూటింగ్ లో పాల్గొనాలి. కానీ, రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తో బిజీగా మారడంతో దర్శకుడు రాజమౌళి డేట్స్ మార్చేశాడట.

‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. ఐతే, ఆ గెస్ట్ రోల్ చిన్నది కాదు. సినిమాలో దాదాపు 40 నిమిషాల పాటు ఉండే పాత్ర. మే 13న విడుదల కానుంది ఈ మూవీ. అందుకే, ఈ సినిమా షూటింగ్ ని ముందుగా పూర్తి చెయ్యాల్సిన బాధ్యత ఉంది చరణ్ పై. దానికి రాజమౌళి కూడా ఒప్పుకున్నారు. సో.. అలా రామ్ చరణ్, ఆలియాపై తీయాల్సిన రెండు పాటలను ఏప్రిల్ కి మార్చారట. సో అలియా భట్ మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేది అప్పుడే.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు. ఎన్టీఆర్ కి జోడిగా ఐరిష్ సుందరి ఒలివియా మోరిస్ నటిస్తోంది. రామ్ చరణ్ భార్య సీత పాత్రలో అలియా భట్ కనిపిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల కానుంది.

More

Related Stories