- Advertisement -

ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చింది నటి అలియా భట్. గర్భం దాల్చగానే అలియా భట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. “దేవర” సినిమాలో ఆమె నటించాల్సింది. ఐతే, గర్భవతి కావడంతో తప్పుకొంది. ఆమె కూతురుకిప్పుడు 10 నెలలు. దాంతో, మళ్ళీ సినిమాలు ఒప్పుకొంటోంది. వరుసగా సినిమాలు సైన్ చేస్తోంది.
అలియా భట్ “గంగూబాయి” నటనకు గాను ఈ ఏడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందింది. అలాగే ఈ ఏడాది “హార్ట్ అఫ్ స్టోన్” సినిమాతో హాలీవుడ్ లో కూడా మెరిసింది. ఇంకా, బాలీవుడ్ లో “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని” చిత్రంతో మంచి విజయాన్ని అందుకొంది. ఆమెకున్న క్రేజ్ వేరు.
అందుకే, ఒక పాపకు తల్లి అయినా వరుసగా సినిమాల మీద సినిమాలు వస్తున్నాయి.
తాజగా ‘జిగ్ర’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే భన్సాలీ తీయనున్న “బైజు బావ్రా” సినిమాలో కూడా అలియానే హీరోయిన్.