అలిసిపోయి ఆసుపత్రిలో చేరిక!

Alia Bhatt

అలియా భట్ …నాన్ స్టాప్ గా వర్క్ చేస్తోంది. ఒక సినిమా షూటింగ్ షెడ్యూలు పూర్తి కాగానే మరోటి. ఒక సినిమా షూటింగ్ హైద్రాబాద్లో, మరోటి ముంబైలో, ఇంకోటి ఢిల్లీలో. అన్ని పెద్ద చిత్రాలే. పెద్ద దర్శకులు తీస్తున్నవే. కోవిడ్ 19 సంక్షోభం తర్వాత షూటింగ్ లు అన్ని మొదలు కాగానే, ఫిలిం మేకర్స్ అందరూ ఆమె డేట్స్ కోసమే ఎగబడ్డారు.

ముందుగా “బ్రహ్మాస్త్ర” సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న “గంగూబాయి” సినిమా షూటింగ్ లో చేరింది. ఇక గత నెలలో రాజమౌళి మూవీ “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ కి వచ్చింది.

ఇప్పుడు “గంగూబాయి” షూటింగ్ తో బిజీగా ఉంది. ఐతే, ఈ సినిమా షూటింగ్ మొత్తం నైట్ టైంలోనే తీస్తున్నాడట దర్శకుడు భన్సాలీ. దాంతో నిద్రలేమితో ఆమె ఆరోగ్యం అప్ సెట్ అయింది. ఆదివారం సెట్ లో కళ్ళు తిరిగి పడిపోవడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేర్చారట. ఒక రోజులోనే ఆమె రికవర్ కావడంతో డిశ్చార్జ్ కూడా చేశారు.

ఇక “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న అలియా వచ్చే నెలలో మళ్ళీ హైదరాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్లో రామ్ చరణ్, అలియా పై ఒక పాట, కొన్ని రొమాంటిక్ సీన్లు తీస్తారట.


More

Related Stories