శ్రీదేవి నాకు ఆదర్శం: ఆలియా భట్

- Advertisement -
Alia Bhatt

ఆలియా భట్ బాలీవుడ్ పెద్ద హీరోయిన్ లలో ఒకరు. ఆమె అభినయం అద్భుతం. స్టార్ డం కూడా మామూలుగా లేదు. ఇప్పుడు ఆమె వరుసగా రెండు తెలుగు సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం… రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’. అయితే “ఆర్ ఆర్ ఆర్”కంటే ముందే ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆలియా. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఆలియాతో ముచ్చట్లు…

చాలాకాలంగా బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు. మీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఎలా ఫీలవుతున్నారు?

రెండు నెలల వరకు అంతా అయోమయం. ఐతే, జనం థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని పుష్ప సినిమా కలిగించింది. దాంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. మా సినిమాని కూడా ఆడియెన్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా ఉన్నాను.

గంగూబాయి పాత్ర మీకు నప్పుతుంది అనుకున్నారా?

సంజయ్‌ సర్‌‌ కథ చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేనిది చేయగలనా అని సార్ ని అడిగాను. నువ్వే చేయగలవని అన్నారు ఆయన. సంజయ్ సార్ నమ్మి ఒప్పుకున్నాను. సంజయ్ సర్ చెప్పింది ఫాలో అయ్యాను. సినిమాలో కొంత పార్ట్ కోసం బరువు కూడా పెరగాల్సి వచ్చింది. డైట్ ఫాలో అవ్వకుండా ఏది తినాలనిపిస్తే అది తినేయమని సంజయ్ సర్ చెప్పారు. అలాగే చేశా.

Gif;base64,R0lGODlhAQABAAAAACH5BAEKAAEALAAAAAABAAEAAAICTAEAOw==

ఆర్‌‌ఆర్‌‌ఆర్ కంటే ముందు గంగూబాయ్ వస్తోంది కదా!

అలా జరిగింది అంతే. “ఆర్ ఆర్ ఆర్” ఎప్పుడో విడుదల కావాలి. కానీ కరోనా వల్ల డేట్స్ మారిపోయాయి. “ఆర్ ఆర్ ఆర్”, “గంగూబాయి”… రెండూ దేనికవే ప్రత్యేకం.

మీ డ్రీం?

ఆల్ ఇండియా యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. శ్రీదేవి గారు నాకు స్ఫూర్తి. ఆమె అన్ని భాషలోనూ సూపర్ స్టార్ అయ్యారు. నేనూ అలా అవ్వాలనేదే నా కోరిక.

More

Related Stories