అలియా చిత్రానికీ సాదా ఓపెనింగ్

- Advertisement -
Alia Bhatt

అలియా భట్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఆమెకి సొంతంగా హీరోల మాదిరి క్రేజ్, స్టార్డం ఉంది. కానీ, ఆమె తాజాగా నటించిన సినిమాకి మాత్రం సరైన ఓపెనింగ్ రాలేదు. అలియా భట్ క్రేజ్ కూడా పెద్దగా ఉపయోగ పడలేదు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన రణవీర్ సింగ్ తో కలిసి కరణ్ జోహార్ తీసిన “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” (Rocky Aur Rani Kii Prem Kahaani) చిత్రం నిన్న (జులై 28) విడుదలైంది.

మొదటి రోజు 10 కోట్లకు అటు ఇటుగా వచ్చింది. ఇది చాలా తక్కువ. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకుడు కరణ్ జోహార్. అతని సినిమాలకు ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది. కానీ బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు పెద్దగా ఆడడం లేదు. దాంతో కరణ్ జోహార్ డైరెక్షన్ చేసినా, అలియా భట్, రణవీర్ సింగ్ నటించినా 10 కోట్ల రేంజులోనే మొదటి రోజు వసూళ్లు రావడం షాక్.

ఇక “రాకీ ఔర్ రాణి” చిత్రానికి కొంత పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఆహా ఓహో అన్నట్లుగా క్రిటిక్స్ రేటింగ్స్ ఇవ్వలేదు. బాగుంది, ఫర్వాలేదు, సో సో …. అన్నట్లుగా రివ్యూస్ వచ్చాయి. మరీ నెగెటివ్ రివ్యూలు రాకపోవడం గొప్ప రిలీఫ్.

ఇక ఈ శని, ఆదివారాల్లో పుంజుకుంటుందా అన్నది చూడాలి. ఇటీవల మంచి రివ్యూస్ వచ్చిన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ చిత్రం “సత్య ప్రేమ్ కి కథ” (Satyaprem Ki Katha)కి కూడా పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇప్పుడు దీనికి అంతే.

Gif;base64,R0lGODlhAQABAAAAACH5BAEKAAEALAAAAAABAAEAAAICTAEAOw==

ఒకప్పుడు బాలీవుడ్ తీసే ఇలాంటి ప్రేమ్ కథలకు, కహానీలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉండేది. పాపం, ఇప్పుడు ఇండియాలో కూడా పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. బహుశా బాలీవుడ్ కూడా పంథా మార్చాలి.

More

Related Stories