అలియా షూటింగ్ వాయిదా

రామ్ చరణ్ కరోనా బారిన పడడంతో రాజమౌళి తీస్తున్న “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ జనవరి షెడ్యూల్ తారుమారు అయింది. చరణ్ ఇప్పుడు కోలుకున్నాడు. కానీ షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు టైం పడుతుంది. అలియా, రామ్ చరణ్ మధ్య జనవరి మొదటివారంలో తీద్దామనుకున్న డేట్స్ కూడా ఇప్పుడు మారిపోయాయి.

అలియా సంక్రాంతి తర్వాత డేట్స్ అడ్జెస్ట్ చేస్తుందా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. సో రామ్ చరణ్, అలియాపై తీయాలనుకున్న పాటని నెక్స్ట్ మంత్ చిత్రీకరిస్తారట. ఈ నెలలో తీయాల్సిన ఈ సాంగ్ షూట్ అలా వాయిదా పండింది.

మరోవైపు, అలియా పెళ్లి చేసుకునే మూడ్ లో ఉంది. బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ఇప్పటికే మీడియాకి వెల్లడించాడు తాము త్వరలోనే ఒక జంట కాబోతున్నామని. ప్రస్తుతం ఈ జంట… ముంబైలో ఒక కొత్త ఇల్లు కొనుక్కునే వేటలో ఉంది. ఆదివారం అలియా, రణబీర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కలిసి రెండు, మూడు ఇళ్ళు చూశారు.

More

Related Stories