రెండేళ్లు ఆగండి: అలియా


అలియా భట్ ఇటీవలే ఒక పాపకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తన బేబీతో ఆమె బిజీగా ఉన్నారు. అందుకే, అలియా భట్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. మరోవైపు, ఆమె మీడియాకి, కెమెరామెన్లకి ఒక విజ్ఞప్తి చేసింది.

తన కూతురు ఫోటోలను ఫొటోగ్రాఫర్లు రెండేళ్ల వరకు తీయొద్దు అని కోరింది. బాలీవుడ్ లో పాపరాజి…. హీరోల, హీరోయిన్ల ప్రతి మూమెంట్ ని ఫొటోలుగా తీస్తారు. వాళ్ళ పిల్లల ఫోటోలను కూడా బంధిస్తారు. ఐతే, తన కూతురుకి రెండేళ్లు వచ్చే వరకు కెమెరామెన్లు తమ కెమెరాలకి పని కల్పించొద్దు అని వేడుకుంటోంది.

నా ఫోటోలు, నా భర్త ఫోటోలు ఎన్నయినా తీసుకోండి. కానీ నా కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో, మీడియాలో పబ్లిష్ చేయొద్దు అని అడుగుతోంది.

“నా కూతురు అందరి అమ్మాయిల్లా పెరగాలి. చిన్నప్పటి నుంచే కెమెరాలు, మీడియా ఫోకసులు వద్దు. ఇదే నా కోరిక,” అని చెప్పింది అలియా.

 

More

Related Stories