- Advertisement -

అలియా భట్ గత వారమంతా హైదరాబాద్ లో “ఆర్.ఆర్.ఆర్” సినిమా షూటింగ్ లో పాల్గొంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆమెకి సంబంధించిన సీన్లు తీశారు రాజమౌళి. ఈ సినిమా వరకు ఆమెకిది ఫస్ట్ షెడ్యూలు. ఆమెపై సోలో సీన్లు తీశారు. రెండో షెడ్యూల్లో రామ్ చరణ్, అలియాపై ఒక రొమాంటిక్ సాంగ్, సీన్లు చిత్రీకరిస్తారు.
“ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ పూర్తి కాగానే వెంటనే ముంబై వెళ్ళింది. అక్కడి నుంచి తన ప్రియుడు, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి గోవా వెళ్ళింది. బాలీవుడ్ కమిట్ మెంట్స్ పూర్తి చేసుకొని మళ్ళీ కొద్దీ రోజుల తర్వాత అలియా హైదరాబాద్ వస్తుంది.

“ఆర్.ఆర్.ఆర్” సినిమా షూటింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. రాజమౌళి గ్యాప్ తీసుకోకుండా చకచకా అన్ని పూర్తి చేస్తున్నాడు.