అలియా తొందరపడదట


గత వారం అలియా భట్ శ్రీమంతం జరిగింది. మరి కొన్ని నెలల్లోనే ఆమె ఒక బాబుకో, పాపకో డెలివరీ ఇవ్వనుంది. దాంతో, వచ్చే ఏడాది ఆమె మళ్ళీ సినిమాలు మొదలు పెడుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాజల్ డెలివరీ కాగానే నాలుగు నెలలలోనే సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఆమె ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తోంది.

కాజల్ తో పోల్చితే అలియా భట్ కున్న క్రేజ్, పాపులారిటీ వేరు కదా. సో, ఆమె కెరీర్ టాప్ లో ఉన్న టైంలోనే పెళ్లి చేసుకొంది. తల్లి అవుతోంది. ఐతే, కాజల్ లా అలియా తొందరపడదని ఆమె టీం చెప్తోంది.

కనీసం ఏడాది పాటు రెస్ట్ తీసుకుంటుందట. ఏడాది తర్వాతే ఆమె కొత్త ఇన్నింగ్స్ షురూ చేస్తుందని చెప్తున్నారు. ఆమె ఎంత గ్యాప్ తీసుకున్నా సినిమాలు, ఆఫర్లు ఎటూ పోవు. అందుకే ఆమె రెండో ఇన్నింగ్స్ విషయంలో ఆమె తొందరపడదనేది ఆమె టీం మాట.

అలియా భట్ భర్త రణబీర్ కపూర్ అగ్ర హీరో. ఆమె కూడా నిర్మాతగా మారారు. సో, ఆమె కెరీర్ విషయంలో వర్రీ కావాల్సిన అవసరం లేదు.

 

More

Related Stories