
అలియా భట్ కి ఏ పాత్ర ఇచ్చినా అదరగొడుతుంది అని అంటారు బాలీవుడ్ విశ్లేషకులు. ఆ మాట నిజం చేసింది మరోసారి అలియా. సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘గంగూబాయి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రానుంది.
గంగూబాయి కతీయవాడి అనే పాత్రలో అలియా రెచ్చిపోయింది. ముంబైలోని కామాటిపుర…వేశ్యావృత్తికి పేరొందిన ప్రాంతం. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వేశ్యగా జీవితాన్ని మొదలుపెట్టి నాయకురాలిగా ఎదిగిన గంగూబాయి కథే ఈ చిత్రం. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో ఎవరు నటించినా మంచి నటన ప్రదర్శిస్తారు. అలా నటన రాబట్టడం ఆయన ప్రత్యేకత. అలియా భట్ ఆయన విజన్ కి తగ్గట్లు నటించింది.
ఈ సినిమా తన కెరీర్ లో ఒక మంచి చిత్రంగా మిగిలిపోతుందని అంటోంది అలియా భట్.
అలియా భట్ రీసెంట్ గా ఎన్టీఆర్ సరసన ఒక కొత్త సినిమాని ఒప్పుకొంది. అంటే, అలియా గురించి మనం తరుచుగా వార్తలు చదువుతాం.