RRR భామ ఎంత పని చేసింది?

Alison Doody

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విడుదల విషయంలో ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. కుదిరితే ఈ ఏడాది దసరా సెలవుల్లో లేదంటే 2022 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనేది రాజమౌళి ప్లాన్. సినిమా గ్రాఫిక్స్ పూర్తి కావడం, ఫారీన్ మార్కెట్ పుంజుకోవడం వంటివి అనేకం ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రభావితం చేస్తాయి. అందుకే, రాజమౌళి విడుదల తేదీ గురించి మౌనం వహిస్తున్నాడు. దసరాకి రావాలని మాత్రం గట్టిగానే అనుకుంటుకున్నారు.

ఐతే, ఈ సినిమాలో నటిస్తున్న ఒక నటి “ఆర్.ఆర్.ఆర్” విడుదల అక్టోబర్ 8 అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కలకలం సృష్టించింది. దర్శకుడు రాజమౌళి అనుమతి లేకుండా తాను రిలీజ్ డేట్ ని లీక్ చేశానని ఆ అమ్మడు తర్వాత గ్రహించింది. వెంటనే తన పోస్ట్ ని తొలగించింది. కానీ ఈ లోప్ అభిమానులు ఆమె పోస్ట్ ని వైరల్ చేశారు.

ఆమె ఎవరో కాదు అలిసన్ డూడి. అనేక హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఐరిష్ నటి అలిసన్ డూడి రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెది మిసెస్ స్కాట్ పాత్ర. ఈ సినిమాలో బ్రిటిష్ వారు విలన్స్. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లో జరుగుతోంది.

Advertisement
 

More

Related Stories