‘హనుమాన్’కి లైన్ క్లియర్

సంక్రాంతి బరిలో “హనుమాన్” చిత్రం నిలుస్తుందా లేదా అన్న అనుమానాలు ఇక అక్కర్లేదు. సంక్రాంతి బరిలో నిలుస్తున్న సినిమాలలో అన్నిటికన్నా ముందే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొంది. అంటే విడుదలకు అంతా క్లియర్ అయింది. ఇక ఏ అడ్డంకులు లేవు.

“గుంటూరు కారం” విడుదల అవుతున్న నాడే “హనుమాన్” థియేటర్లలోకి వస్తోంది.

ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ వ చ్చింది. “హనుమాన్ విజువల్ గా అద్భుతంగా వుంది. ఎమోషన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. కంటెంట్ చాలా మెస్మరైజింగా ఉంది.” అని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు టీం చెప్తోంది.

ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ కాగా, వినయ్ రాయ్ విలన్ గా నటించాడు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుంది.

 

More

Related Stories