మిగిలిన ఆ రెండింటిపైనే ఆశలు

Tillu Square and Om Bheem Bush

2024 మార్చి నెల తెలుగుసినిమాకి పెద్దగా కలిసి రాలేదు. ఈ నెలలో ఇప్పటివరకు విడుదలైన తెలుగు చిత్రాలు.. “ఆపరేషన్ వాలెంటైన్”, “గామి”, “భీమా,” “తంత్ర”, “షరతులు వర్తిస్తాయి”, “రజాకార్”. ఇందులో “గామి” ఒక్కటే కాస్త ఆడింది. అది కూడా మొదటి మూడు రోజులు మాత్రమే. ఆ తర్వాత అది కూడా తుస్సుమంది.

అంటే ఈ నెలలో ఒక్క స్ట్రయిట్ తెలుగు చిత్రం హిట్ అనిపించుకోలేదు. ఇక తాజాగా ఈ వీకెండ్ విడుదల నుంచి అల్లరి నరేష్ కొత్త చిత్రం తప్పుకొంది. “ఆ ఒక్కటి అడక్కు” అనే సినిమాలో నరేష్ నటించాడు. మార్చి 22న విడుదల కావలిసిన ఈ మూవీ వచ్చే నెలకు వాయిదాపడింది. ఇక ఈ నెలలో మిగిలిన చిత్రాలు రెండే.

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన “ఓం భీం బుష్” ట్రైలర్ తో ఆకట్టుకొంది. ఈ సినిమాలోని కామెడీ జనాలకు నచ్చేలా ఉంది. ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది. శ్రీ విష్ణు ఇటీవలే మంచి విజయం అందుకున్నాడు. మరి ఈ సినిమాతో కూడా మరో హిట్ ని ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.

ఇక భారీ అంచనాలున్న మూవీ “టిల్లు స్క్వేర్” నెలాఖరున అంటే మార్చి 29న విడుదల కానుంది. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్, పాటలు, టీజర్…అన్నీ ఆకట్టుకున్నాయి. చూస్తుంటే ఇది “శ్యుర్ షాట్ హిట్” అనిపిస్తోంది. పైగా సూపర్ డూపర్ హిట్ అయిన “డీజే టిల్లు” సినిమాకి ఇది సీక్వెల్. సో, అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మరి మిగిలిన ఈ రెండు సినిమాలపైనే బయ్యర్లు ఈ నెల ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండూ విజయాలు సాధించి మంచి జోష్ ని తెస్తాయా?

Advertisement
 

More

Related Stories