నరేష్ లో అల్లరి పోయింది

నరేష్ లో అల్లరి పోయింది

అల్లరి నరేష్ ఇటీవల హీరోగా చేసిన సినిమాలేవీ కలిసిరాలేదు. బాక్సాఫీస్ వద్ద ఒక్కటీ ఆడలేదు. అలాగే, ఆ సినిమాలేవీ అతనికి నటుడిగా పేరు తీసుకురాలేదు. పైగా… ఒకే పద్దతిలో యాక్ట్ చేస్తున్నాడని విమర్శలనే మూటగట్టుకున్నాడు. తాజాగా విడుదలైన ‘నాంది’ అన్ని విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

నరేష్ లోని అల్లరి ఎగిరిపోయింది. నటుడిగా ప్రశంసలు తీసుకొచ్చింది. క్రిటిక్స్ అందరూ నరేష్ నటనని తెగ మెచ్చుకున్నారు. ఈ సినిమాకి రేటింగ్స్ విషయంలో మిక్స్డ్ గా వఛ్చినా… క్రిటిక్స్ అందరూ యూనానిమస్ గా నరేష్ నటన అద్భుతంగా ఉందని కితాబు ఇవ్వడం విశేషం.

నరేష్ మంచి నటుడు అన్న విషయం ఎప్పుడో ప్రూవ్ అయింది. కానీ అతను కొంతకాలంగా ఒక ఛట్రంలో పడిపోయాడు. దాన్నుంచి బయటపడేందుకు చేసిన ఈ ప్రయత్నమే …నాంది. నరేష్ అటెంప్ట్ సక్సెస్ అయింది. సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఉన్నా… నరేష్ కి ఇది ఒక బూస్టప్. గర్వంగా చెప్పుకునే పర్ఫార్మెన్స్.

More

Related Stories