
అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవికి బావమరిది. సో, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక ఆయన్ని మామయ్య అని పిలుస్తారు. కానీ, అల్లు అరవింద్ ఇప్పుడు కుర్రకారుకి మొత్తంగా మావయ్య అయ్యారు. ఆయన స్టేజ్ మీద ఉండగానే మావయ్య అని కొందరు యంగ్ స్టర్స్ అని పిలవడం విశేషం.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటే కుర్రకారుకి తెగ అది. ముఖ్యంగా ‘రౌడీ బాయ్స్’, ‘కార్తికేయ 2′ సినిమాల తర్వాత ఆమె గ్రాఫ్ పెరిగింది. యూత్ కి బాగా నచ్చింది. ఆమె తాజాగా నటించిన ’18 పేజెస్’ చిత్రానికి అల్లు అరవింద్ ప్రెజెంటర్. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగం జరిగిన ఒక ఈవెంట్ లో అల్లు అరవింద్ ఆమె గురించి మాట్లాడుతూ… అనుపమ తన కూతురులాంటిది అని చెప్పారు.
ఆ తర్వాత జరిగిన మరో ఈవెంట్ లో కూడా ఈ రోజు నా కూతురు అనుపమ రాలేదు అన్నారు. అంతే, ఓకే అరవింద్ మావయ్య అంటూ ఫ్యాన్స్ కింది నుంచి అరిచారు. అనుపమ తమకి డార్లింగ్ ఐతే, ఆమె తండ్రి తమకి మావయ్య అవుతాడు కదా అనేది అనుపమ ఫ్యాన్స్ మాట.
అభిమానులు తనని మావయ్య అని అంటున్నారో లేట్ గా అర్థం చేసుకున్న అల్లు అరవింద్ ఆ తర్వాత హాయిగా నవ్వారు.