అల్లు అర్జున్ చిత్రానికి అనిరుధ్!

Allu Arjun and Anirudh

అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. నిర్మాతల లెక్క ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల అవుతుంది. ఆ ప్రకారం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఐతే, ఈ సినిమా ఆ టైంకి రాదు అని, వాయిదా పడుతుందనే రూమర్లు కూడా ఉన్నాయి. ఆ సంగతేమో గాని అల్లు అర్జున్ మరో చిత్రం స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నది నిజం.

దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ కానుంది. తమిళంలో విజయ్ హీరోగా వరుసగా మూడు హిట్స్ కొట్టి ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి షారుక్ ఖాన్ తో “జవాన్” చిత్రంతో సంచలన విజయం అందుకున్నాడు అట్లీ. ఈ డైరెక్టర్ తో సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే, అట్లీ అడుగుతున్న భారీ పారితోషకానికి కూడా నిర్మాత ఒప్పుకునేలా చేశారట అల్లు అర్జున్. అట్లీ దాదాపు 60 కోట్లు అడుగుతున్నట్లు టాక్.

ఇక ఈ సినిమాకి సాంకేతిక నిపుణులు కూడా టాప్ వాళ్లే ఉంటారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

అనిరుధ్ ప్రస్తుతం “దేవర” చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ కొత్త చిత్రానికి కూడా మ్యూజిక్ ఇవ్వనున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి కూడా పని చెయ్యనున్నాడు అన్నమాట. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.

Advertisement
 

More

Related Stories