మాటీవీ ఖాతాలో పుష్ప, సర్కార్?

Mahesh Babu and Allu Arjun

సరిగ్గా ఏడాది కిందటి సంగతి. బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’, మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు రెండూ జెమినీ టీవీ వశమయ్యాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ రెండు పెద్ద సినిమాల్ని ఆ ఛానెల్ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత టీవీల్లో టెలికాస్ట్ చేస్తే పోటీపడి మరీ రేటింగ్స్ సాధించాయి ఈ రెండు మూవీస్.

అలా మూవీస్ సెగ్మెంట్ లో తన ఆధిపత్యాన్ని కోల్పోయింది స్టార్ మా ఛానెల్. ఓవైపు కార్తీకదీపం, బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలతో అది నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ… ఈ సీజన్ లో రెండు పెద్ద సినిమాలు జెమినీకి వెళ్లిపోవడంతో స్టార్ మా ఛానెల్, స్టార్ ఎట్రాక్షన్ ను మిస్సయింది.

ఈసారి ఆ తప్పును మళ్లీ రిపీట్ చేయదలుచుకోలేదు సదరు ఛానెల్. అందుకే ఇటు బన్నీ అప్ కమింగ్ మూవీని, అటు మహేష్ చేయబోయే సినిమాను ఒకేసారి దక్కించుకుంది. అవును.. బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా.. మహేష్ సెట్స్ పైకి తీసుకురాబోతున్న ‘సర్కారువారి పాట’ సినిమాలు రెండింటినీ స్టార్ మా దాదాపు దక్కించుకుంది.

ఎంత మొత్తానికి ఈ రెండు సినిమాలు డీల్ క్లోజ్ చేసుకున్నాయనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

Related Stories