వీళ్లకు భయం లేదా?

కరోనా కల్లోలంతో అన్ని సినిమాల షూటింగులు రద్దు అయ్యాయి. కానీ నాని, బన్నీ మాత్రం షూటింగ్స్ ఇంకా బంద్ చేసుకోలేదు. హైదరాబాద్ లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు భయపడడం లేదు అనేదే ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యేవి కావు. వాటి రిలీజ్ డేట్ కి చాలా నెలల టైం ఉంది. మరి ఎందుకు ఇంతగా తొందరపడుతున్నారు అనేది ప్రశ్న.

అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. లేటెస్ట్ గా విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, హీరోయిన్ అనసూయ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. సుకుమార్ ఈ సినిమా విషయంలో పట్టుదలగా ఉన్నాడు.

ఇక ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొనసాగుతోంది. నాని అటు ఈ సినిమాతో పాటు అటు ‘అంటే సుందరానికి’ అనే సీన్మేల్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు.

More

Related Stories