బన్ని – వంగా సినిమా 2028లోనా?

- Advertisement -
Allu Arjun

అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఒక సినిమా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఆ మధ్య ప్రకటించింది. అల్లు అర్జున్ కూడా దాన్ని రీ పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. అలాగే, వంగా తీసిన “యానిమల్” చిత్రాన్ని తెగ పొగిడాడు బన్ని. దాంతో, అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. “యానిమల్” దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా సెట్ అయింది అని ఫ్యాన్స్ చాలా ఖుషి అయ్యారు.

ఐతే, ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల ఆశలపై వంగా నీళ్లు చల్లాడు. అల్లు అర్జున్ తో సినిమా ఉండే అవకాశం ఉంది కానీ ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను అంటూ ఆ కబురుని చల్లగా చెప్పాడు.

ప్రభాస్ హీరోగా “స్పిరిట్” అనే సినిమా తీయనున్నాడు వంగా. అది 2025 చివరలో విడుదల అవుతుందట. ఆ తర్వాత 2026లో “యానిమల్ పార్క్” పేరుతో రణబీర్ కపూర్ హీరోగా “యానిమల్” సినిమాకి సీక్వెల్ స్టార్ట్ చేస్తాడట. సినిమా, సినిమాకి రెండేళ్ల నుంచి మూడేళ్ళ టైం తీసుకుంటాడు వంగా. ఆ లెక్కన “యానిమల్ పార్క్” విడుదల 2027 తర్వాతే ఉంటుంది.

సో, అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా సినిమా స్టార్ట్ కావాలంటే 2028 వరకు ఆగాలి. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పలేం.

 

More

Related Stories