ఉపాసన సీమంతంలో బన్ని

రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య సరైన సంబంధాలు లేవనేది టాక్. రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయి అనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వారి అభిమానులు కూడా తరుచు గొడవపడుతున్నారు.

అలాగే, రామ్ చరణ్ కి విషెష్ చెప్పాల్సిన సందర్భంలో అల్లు అర్జున్ పెట్టే పోస్టులు కూడా అలాంటి భావనే కలిగిస్తుంది. ఐతే, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రం అల్లు అర్జున్, రామ్ చరణ్ కలుసుకుంటారు. ఫోటోలు దిగుతారు.

రీసెంట్ గా రామ్ చరణ్ భార్యకి హైదరాబాద్ లో సీమంతం (బేబీ షవర్) జరిపారు. ఈ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చాలా హడావిడి చేశారు. అంతే కాదు తన ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి అందమైన శుభాకాంక్షలు కూడా తెలిపారు.

“So happy for my sweetest Upsi.” (చాలా ఆనందంగా ఉంది ఉప్సి) అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసనల బంధం అద్భుతం అన్నట్లుగా మాట్లాడారు. సడెన్ గా అల్లు అర్జున్, రామ్ చరణ్ కుటుంబాలు ఇలా సోషల్ మీడియా వేదికగా తమ మధ్య ఉన్న అనుబంధాలు చూపించడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

Advertisement
 

More

Related Stories