
హీరో అల్లు అర్జున్ తన 40వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. సెర్బియాలోని బెల్గ్రేడ్ లో బర్త్ డే సంబరాలు జరిగాయి. ఈ వేడుకల కోసం తన భార్య, పిల్లలుతో పాటు మరో 50 మంది మిత్రులను, ఇతర కుటుంబ సభ్యులను బెల్గ్రేడ్ తీసుకెళ్లాడు అల్లు అర్జున్.
వారం రోజుల పాటు ఎంజాయ్ చేసి ఈరోజు హైదరాబాద్ వచ్చాడు. ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చింది వీరి మిత్రబృందం.
ఇక ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ పెంచుకునే పనిలో పడుతాడు. “పుష్ప2” సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ పాత్ర కోసం మళ్ళీ బాడీ మార్చుకోవాలి. ఇప్పుడు ఆ పనిలో ఉంటాడు.
దర్శకుడు సుకుమార్ మరో రెండు, మూడు నెలల సమయం కావాలి అని అడిగినట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాని భారీ ఎత్తున తీయనున్నారు. హిందీలో మొదటి భాగం భారీ హిట్ అయింది. దాంతో, రెండో పార్ట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు.