ఈ ప్రాజెక్ట్ బన్ని సెట్ చేశాడా!

Vijay Deverakonda and Sukumar

సుకుమార్, విజయ్ దేవరకొండ… ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటన అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఎందుకంటే… ఎవరూ ఈ యాంగిల్ లో ఆలోచించలేదు. సుకుమార్ “పుష్ప” మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత కూడా టాప్ స్టార్ తోనే మూవీ చేస్తాడని అనుకున్నారు. కానీ “పుష్ప” తర్వాత దేవరకొండతో మూవీ ఉండనుంది. ఎందుకంటే… “పుష్ప” షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అయ్యేసరికి మరో పది నెలలు పడుతుంది. ఆపై, సుకుమార్ స్క్రిప్ట్ పూర్తి చెయ్యాలంటే ఎంత లేదన్నా మరో ఆరేడు నెలలు పడుతుంది. అప్పటికి దేవరకొండ కూడా పూరి, శివ నిర్వాణ సినిమాలు పూర్తి చేసేస్తాడు.

ఇంతకీ వీరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన ఎందుకు వచ్చింది? ఈ సినిమాని నిర్మిస్తున్నది కేదార్. అతని అల్లు అర్జున్ బిజినెస్ పార్ట్నర్. అల్లు అర్జున్ నిర్వహించే “800” పబ్ సహా ఇతర వ్యాపారాల్లో భాగస్వామి. అలాగే, అతనికి సొంతంగా ఇతర వ్యాపారాలు ఉన్నాయి. తన మొదటి సినిమాని బన్నీ హీరోగా తీయాలనుకున్నాడు. కానీ తనకు ఉన్న కమిట్ మెంట్స్ కారణంగా …బన్నీ ఈ లోపు విజయ్ దేవరకొండ, సుకుమార్ తో చెయ్యి అని చెప్పాడట.

అల్లు అర్జున్ అటు దేవరకొండతోనూ, ఇటు సుకుమార్ తోనూ మాట్లాడాడు. ఇద్దరికీ కేదార్ “భారీ” పారితోషికాలు ఇస్తున్నాడు. ముందే అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు.

దేవరకొండ… ఇప్పటికే అల్లు అరవింద్ తో ఒక వ్యాపారంలో పార్ట్నర్ గా ఉన్నాడు. ఇలా అందరికి అన్ని లింక్లున్నాయి.

Related Stories