
మొన్నటివరకు ‘పుష్ప’ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. ఇప్పుడు తన ఇంట్లో మరో సెలబ్రేషన్ షురూ చేశాడు. ఈరోజు (మార్చి 6) అల్లు అర్జున్ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి కేక్ కట్ చేశాడు అల్లువారబ్బాయి. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా.
బన్నీ-స్నేహారెడ్డికి పెళ్లయి ఇవాళ్టికి 11 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు బన్నీ. హ్యాపీ యానివర్సిరీ క్యూటీ అంటూ తన భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు. కొడుకు అయాన్, కూతురు ఆద్య, భార్య స్నేహతో కేక్ కట్ చేయించాడు.
గతేడాది వివాహ వార్షికోత్సవాన్ని సరిగ్గా జరుపుకోలేకపోయాడు బన్నీ. ఆ టైమ్ లో పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్నాడు. పైగా కరోనా భయాలు. అందుకే ఈ ఏడాది కుటుంబంతో కలిసి మరో టూర్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయాల్సిన ‘పుష్ప 2’ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ గ్యాప్ ను కుటుంబానికి కేటాయిస్తున్నాడు బన్నీ. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యాడు.