బాలుకి భారతరత్న ఇవ్వాల్సిందే

బాలు ఓ చరిత్ర. ఆయన గాత్రం అజరామరం. ఆయన సాధించిన విజయాలు అసమానం. తన రంగంలో ఎస్పీ బాలసుబ్రమణ్యంను మించిన వ్యక్తి లేరు. అందుకే బాలుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలోకి సీనియర్ హీరో అర్జున్ కూడా ఎంటరయ్యారు.

బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందేనంటున్నాడు అర్జున్. ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని, గ్రేట్ సింగర్ అని.. అన్ని పరిశ్రమలు కలిసి బాలు గారికి భారతరత్న వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బాలసుబ్రమణ్యం అంత్యక్రియల్లో పాల్గొన్న అతికొద్ది మంది ప్రముఖుల్లో అర్జున్ ఒకరు. బాలును ఎప్పుడు కలిసినా తనలో ఏదో తెలియని ఉత్సాహం, ఎనర్జీ వచ్చేదని గుర్తుచేసుకున్న అర్జున్.. బాలును గ్రేట్ సింగర్ అనే కంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనడానికే తాను ఇష్టపడతానంటున్నాడు. ఈ అంత్యక్రియల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, దేవిశ్రీప్రసాద్, భారతీరాజా లాంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Related Stories