- Advertisement -

అల్లు అర్జున్ కి సంబందించిన కొత్త వీడియో వైరల్ అయింది. ఇంతకీ అల్లు అర్జున్ ఏమి చేశాడు? ఒక పూరి పాకలో ఉన్న చిన్న రోడ్ సైడ్ హోటల్ కి వెళ్లి అక్కడ టిఫిన్ చేశాడు అల్లు అర్జున్.
సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘పుష్ప’ షూటింగ్ కోసం బన్నీ తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళాడు. గోకవరం వైపు నుంచి వెళ్తుండగా అక్కడ కనిపించిన ఒక చిన్న హోటల్ వద్ద తన కారుని ఆపి, ఆ హోటల్‌లో టిఫిన్ చేశారు.
అంత పెద్ద హీరో తమ హోటల్లో టిఫిన్ చెయ్యడంతో ఆ హోటల్ యజమాని ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. డబ్బులు తీసుకునేందుకు ఆ యజమాని ఒప్పుకోలేదు. కానీ బన్నీ బిల్లు చెల్లించే బయటకి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.