
‘రాజరాజ చోర’ సినిమాకు అటు, ఇటు శ్రీవిష్ణుకు సరైన హిట్స్ లేవు. తాజాగా చేసిన ‘భళా తందనాన’ చిత్రం మరీ దారుణం. దీంతో తన అప్ కమింగ్ మూవీ ‘అల్లూరి’పై గంపెడాశలు పెట్టుకున్నాడు ఈ హీరో. పైగా ఈసారి చేసింది ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్. ఈ సినిమా క్లిక్ అయితే అటు సక్సెస్ రావడమే కాదు, ఇటు మాస్-యాక్షన్ హీరోగా కూడా సెటిలైపోవచ్చు. అందుకే శ్రీవిష్ణు ఈసారి చాలా కేర్ ఫుల్ గా అడుగులు వేస్తున్నాడు.
తాజాగా సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేసిన ఈ నటుడు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో సినిమాపై బజ్ ను మరింత పెంచాలనుకుంటున్నాడు. అందుకే ఏకంగా తన మూవీ ఫంక్షన్ కు అల్లు అర్జున్ ను ఆహ్వానించాడు.
రేపు హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.
నిజానికి ఈ సినిమా మొన్నటివరకు ఆర్థిక కష్టాలు చవిచూసింది. స్వయంగా శ్రీవిష్ణు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తో కలిసి రంగంలోకి దిగి, తనకు తెలిసిన వాళ్లతో మాట్లాడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు. అలా సినిమాకు లైన్ క్లియర్ అవ్వడంతో 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్నాడు అల్లూరి.