స్టైల్ పోయి ఐకాన్ వచ్చే!

Icon Star

అల్లు అర్జున్ అనగానే స్టయిల్ గుర్తొస్తోంది. అందుకే అభిమానులు ఆయనికి ‘స్టయిలిష్ స్టార్’ అనే టాగ్ ఇచ్చారు. చాలా ఏళ్ల క్రితమే ఈ బిరుదు సెట్ అయింది బన్నీకి. కానీ, ఇప్పుడు బన్నీ దాంతో సంతృప్తి పడట్లేదు. తన రేంజ్ ఇప్పుడు అంతకుమించి అనుకుంటున్నారు కాబోలు. ఇప్పుడు తనని ఒక ఐకాన్ గా గుర్తించాలి అని భావిస్తున్నాడు. అందుకే “ఐకాన్ స్టార్” అనే బిరుదు యాడ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్.

“పుష్ప” టీజర్ “ఐకాన్ స్టార్” అనే టాగ్ కనిపిస్తుంది. ఇకపై ‘స్టయిలిష్ స్టార్’ అనేది కనిపించదు.

అప్పుడెప్పుడో ‘ఐకాన్’ అనే సినిమా ప్రకటించాడు బన్నీ. శ్రీరామ్ వేణు (‘వకీల్ సాబ్’) డైరెక్షన్ లో చెయ్యాలనుకున్నాడు. ఆ సినిమా సైడ్ అయింది. కానీ ఆ టాగ్ మాత్రం ఇప్పుడు యాడ్ అయింది. ‘ఐకాన్’ మూవీ చెయ్యకపోయినా ‘ఐకాన్ స్టార్’ అయ్యాడు బన్నీ.

More

Related Stories