
హీరో అల్లు అర్జున్ కి నోటీసులు వెళ్లాయి తెలంగాణ ఆర్టీసీ నుంచి. ప్రముఖ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ (టి.యస్ ఆర్టీసీ)కి ఎండిగా బాధ్యతలు చేపట్టి ఆర్టీసీని గాడిలో పెడుతున్నారు.
తాజాగా ఆయన హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు పంపించారు. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు ఈ నోటీసులు వెళ్లాయి.
హీరో అల్లు అర్జున్ ‘రాపిడో’ బ్రాండ్ కి అంబాసిడర్. ఇటీవలే ఆ బ్రాండ్ యాడ్ లో నటించారు బన్నీ. ఆ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెలలా ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో వేగంగా, సురక్షితంగా ఉంటూ అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందన్నట్లుగా చెప్పారు.
ఈ ప్రకటనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని సజ్జన్నార్ పేర్కొన్నారు. టిఎస్ఆర్టీసి సామాన్యుల సేవలో ఉందని, అందుకే నటునికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నాం అని చెప్పారు సజ్జనార్.