పుష్ప 2 కోసం బన్ని కసరత్తు

- Advertisement -
Pushpa

“పుష్ప” సినిమాలో పుష్పరాజ్ పాత్ర కోసం బన్ని తనని తాను చాలా మార్చుకున్నాడు. మూడు నెలల పాటు బాడీని మార్చుకున్నాడు. యాస నేర్చుకున్నాడు. ఇలా ఎంతో శ్రమ ఉంది ఆ పాత్ర పోషణ వెనుకాల. అందుకే, “పుష్ప” విజయంలో ఎక్కువ క్రెడిట్ దక్కింది అల్లు అర్జున్ కే.

అలాగే మేకప్ వేసుకునేందుకు ప్రతిరోజూ రెండు గంటలపాటు సమయం పట్టేదంట. ఆ మేకోవర్ వీడియోని తాజాగా విడుదల చేశారు. పుష్ప మేకోవర్ వీడియో ఇక్కడ చూడొచ్చు.

మరోవైపు, రెండో భాగం కోసం మళ్ళీ తనని మార్చుకుంటున్నాడు అల్లు అర్జున్.

రెండో భాగంలో మరింత యాక్షన్ ఉంటుంది. అల్లు అర్జున్ హీరోయిజం కూడా మరింత ఎక్కువగా ఎలివేట్ అయ్యేలా సీన్స్ రాస్తున్నారట. ఇప్పటి నుంచే అల్లు అర్జున్ ఈ పాత్ర కోసం కసరత్తులు షురూ చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాతో హిందీ మార్కెట్ రావడంతో అల్లు అర్జున్ చాలా ఖుషీగా ఉన్నాడు. మరింత ఫోకస్ తో రెండో భాగం కి పని చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సారి అన్ని భారీగా ఉంటాయి.

దర్శకుడు సుకుమార్ కూడా రెండో భాగం విషయంలో తగ్గేదే లే అంటున్నారు. మొదటి భాగం హడావిడిగా రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది కానీ పుష్ప 2 మాత్రం రిలాక్స్డ్ గా విడుదల చేస్తామంటున్నారు.

 

More

Related Stories