విదేశాల్లో బన్నీ, హరీష్ యాడ్ షూట్


అల్లు అర్జున్ మొన్నటి వరకు విదేశాల్లో విహార యాత్ర చేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఫారిన్ వెళ్ళాడు. ఐతే, ఈ సారి షూటింగ్ కోసం. అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఒక యాడ్ చిత్రీకరణ విదేశాల్లో జరగనుంది.

ఈ యాడ్ ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్నారు. బన్ని, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘డీజె’ చిత్రం వచ్చింది. ఆ సినిమా నుంచి వారి బంధం బలపడింది. ఈ యాడ్ ని ముంబైకి చెందిన టీమ్ ని తీస్తోంది. కానీ, బన్నీ పట్టుబట్టి హరీష్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. హరీష్ పర్యవేక్షణలో ఆ టీం ఈ యాడ్ ని చిత్రీకరిస్తుంది.

‘పుష్ప’ సినిమా తర్వాత బన్ని రేంజు మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు కూడా అల్లు అర్జున్ పై ఎక్కువ ఖర్చు పెట్టి యాడ్స్ తీస్తున్నాయి.

వచ్చేనెలలో కానీ, సెప్టెంబర్ లో కానీ ‘పుష్ప 2’ షూటింగ్ మొదలవుతుంది.

 

More

Related Stories