సరిగ్గా ఏడాది తర్వాత మొదలు

Allu Arjun


‘పుష్ప 2’ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అయింది. కానీ, అల్లు అర్జున్ తో సంబంధం లేని సన్నివేశాలను తీసుకుంటూ వెళ్తున్నాడు సుకుమార్. ఇప్పుడు షూటింగ్ లోకి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతున్న కొత్త షెడ్యూల్ లో బన్నీపై కీలక సన్నివేశాలు తీసారట.

అల్లు అర్జున్ కెరియర్ లో ‘పుష్ప’ ఒక మలుపు. ఈ సినిమా తెలుగులో కన్నా హిందీలో పెద్ద హిట్ అయింది. దాంతో, బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాంతో, ‘పుష్ప 2’ ఇంకా భారీగా చెయ్యాలనే ఉద్దేశంతో ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు బన్నీ. గతేడాది డిసెంబర్ లో ‘పుష్ప’ విడుదల అయింది. ఈ ఏడాది డిసెంబర్ లో ‘పుష్ప 2’ షూటింగ్ లో చేరాడు.

మొదటి భాగంలో నటించిన రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ వంటివారు ‘పుష్ప 2’ సినిమాలో కూడా కనిపిస్తారు. కొన్ని ఇతర పాత్రలకు కొంచెం పేరొందిన స్టార్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ‘పుష్ప’ రష్యాలో విడుదలైంది. ‘పుష్ప 2’ మాత్రం జపాన్, చైనా వంటి పెద్ద మార్కెట్ లో కూడా విడుదల చేసే ప్లాన్స్ ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories