
‘పుష్ప’ విడుదలైన తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇటీవలే ‘పుష్ప 2’ షూటింగ్ షురూ చేశాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తన తదుపరి రెండు సినిమాలు లాక్ చేసుకున్నాడు . ‘పుష్ప 2’ తర్వాత తన ఫెవరేట్ దర్శకుడు త్రివిక్రమ్ తో మరో సినిమా చేస్తాడు.
ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తాడు బన్నీ. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు బన్నీ లైనప్ ఇలా ఉంది. సుకుమార్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా… ఈ ముగ్గురు దర్శకులతో సినిమాలను లాక్ చేసుకున్నారు అల్లు అర్జున్.
2023 అంతా పుష్ప 2తో బిజీ
2024లో త్రివిక్రమ్ మూవీ షూటింగ్
2025లో సందీప్ వంగా మూవీ షురూ
ALSO CHECK: Allu Arjun and Sandeep Reddy Vanga’s film announced

ఒక్కో సినిమా ఒక్కో జాన్రాలో ఉంటుంది. ఇలా వైవిధ్యంగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఐతే, బన్నీ ఇంతకుముందు కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా అనుకున్న విషయం తెలిసిందే. అది మాత్రం ఇప్పట్లో అయ్యేలా లేదు.
ఇదీ చదవండి: అంత పెద్ద హిట్ కొట్టినా యంగ్ హీరోలు దేకరే.. ఇక మళ్లీ సీనియర్సే దిక్కా?