బన్నీ కోలుకుంటున్నాడట

Allu Arjun

అల్లు అర్జున్ కరోనా నుంచి వేగంగానే కోలుకుంటున్నాడట. బన్నీకి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అందుకే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ కి గత వారం కరోనా అని తేలింది. ‘పుష్ప’ షూటింగ్ లో అతనికి కరోనా సోకింది. ఈ సినిమా యూనిట్ లో చాలామంది కరోనా బాధితులే.

ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ ని నిరవధికంగా ఆపేశారు. పూర్తిగా కరోనా కేసులు తగ్గిన తర్వాతే మళ్ళీ షురూ చేస్తారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొత్త సినిమాల గురించి నిర్ణయాలు తీసుకుంటాడట. తదుపరి ఏ మూవీకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వేణు శ్రీరామ్ చెప్పిన ‘ఐకాన్’ కథ, ప్రశాంత్ నీల్ చెప్పిన సింగిల్ లైన్ స్టోరీస్ కి ఇప్పటికే ఓకే చెప్పాడు అల్లు అర్జున్. కానీ ఇవి ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయనేది చూడాలి.

More

Related Stories