- Advertisement -

“పుష్ప” సినిమాతో పాన్ ఇండియా పేరు సంపాదించుకున్న అల్లుఅర్జున్ కోసం ఒక అవార్డు టీం హైదరాబాద్ కి తరలి వచ్చింది.
GQ MOTY అవార్డ్స్ 2022 కి ఎంపికయ్యాడు అల్లు అర్జున్. సాధారణంగా ఈ మేగజైన్ ప్రతి ఏడాది ముంబైలోనో, ఢిల్లీలోనో ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. కానీ, ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ కోసం ఆ టీం హైదరాబాద్ తరలి వచ్చింది. GQ టీమ్ మొత్తం హైదరాబాద్‌కు వచ్చి తాజ్ ఫలుఖ్‌నామా ప్యాలెస్‌లో పార్టీ కూడా హోస్ట్ చేశారట.
ఒక టాలీవుడ్ నటుడు GQ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి.
ఇది బన్నీ రేంజ్ అని ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.