
ఇటీవలే 2021 సంవత్సరానికి గాను జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు.
“పుష్ప” సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చినందుకు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా నిలవడం ఇదే మొదటిసారి. అలా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.
పుష్ప చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్, ‘కొండపొలం’ చిత్రంలో పాటకు గాను దేవిశ్రీప్రసాద్ కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఇక “ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి కూడా పలు అవార్డులు వచ్చాయి. ఆ టీం కూడా అవార్డులు స్వీకరించింది. ‘ఉప్పెన’ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్ స్వీకరించారు.

ఇక ఉత్తమ నటిగా అలియా భట్ కూడా అవార్డు అందుకున్నారు. ‘గంగూభాయ్’ చిత్రంలో ఆమె నటనకు ఈ అవార్డు వచ్చింది. ‘మిమి’ చిత్రంలో నటనకు కృతి సనన్ కూడా ఉత్తమ నటి అవార్డుని అలియా భట్ తో షేర్ చేసుకొంది. ఈసారి ఇద్దరు హీరోయిన్లు ఉత్తమ నటీమణులుగా నిలిచారు.