
అల్లు అర్జున్ ఇప్పుడు ఇద్దరి పిల్లల తండ్రి. ఆయన భార్య కూడా ఒకప్పుడు ఆయన గాళ్ ఫ్రెండే. అయినా… పబ్లిక్ గా తన మొదటి గాళ్ ఫ్రెండ్ ఎవరో చెప్పారు అల్లు అర్జున్.
ఒక వెబ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ అతిథిగా వచ్చాడు. అక్కడ పాట పాడిన అమ్మాయిని మెచ్చుకున్నాడు. “మీ వాయిస్ తో పాటు మీ పేరు కూడా నచ్చింది. నా మొదటి గాళ్ ఫ్రెండ్ కూడా మీ పేరే శృతి,” అంటూ అసలు విషయం బయట పెట్టాడు. అల్లు అర్జున్ తన మొదటి గాళ్ ఫ్రెండ్ అని చెప్పాడు కానీ ఇంకా డీటేల్డ్ గా వెళ్ళలేదు.
పెళ్ళికి ముందు అల్లు అర్జున్ పెద్దగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి రూమర్స్ ఎదుర్కోలేదు. అల్లు అర్జున్ హీరోగా మారకముందే స్నేహ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ తర్వాత ఇరువైపులా పెద్దల ఆశీర్వాదంతో ఆమెనే పెళ్లాడాడు. అల్లు అర్జున్, స్నేహకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.