బన్నీకి ప్రేమతో రౌడీ గిఫ్ట్

vijay bunny

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ, బన్నీకి ఓ గిఫ్ట్ పంపించాడు. తన రౌడీ బ్రాండ్ నుంచి కొత్తగా తయారుచేసిన డిజైన్ లో తొలి డ్రెస్ ను బన్నీకి కానుకగా అందించాడు విజయ్. ఇందులో టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ తో పాటు మ్యాచింగ్ మాస్క్ కూడా ఉంది. గిఫ్ట్ అందుకున్న బన్నీ, విజయ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.

నిజానికి బన్నీకి, విజయ్ ఇలా బహుమతి అందించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. “అల వైకుంఠపురములో” సినిమా రిలీజ్ కు ముందు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ కలర్ ఫుల్ “రౌడీ వేర్” పంపించాడు విజయ్. దానికి రిప్లయ్ గా థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. “అల వైకుంఠపురములో” సెలబ్రేషన్స్ లో ఆ డ్రెస్ వాడుతానని అప్పట్లో ట్వీట్ చేశాడు.

విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం ఆడియో ఫంక్షన్ కు, టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య ఈ ఫ్రెండ్ షిప్ బాండ్ కొనసాగుతూ వస్తోంది.

Related Stories