
‘పుష్ప’ సినిమా విజయంతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. ఈ సినిమా అతనికి హిందీ మార్కెట్ క్రియేట్ చేసింది. జాతీయస్థాయిలో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. దాంతో, కార్పొరేట్ బ్రాండ్లు కూడా పెద్ద ఎత్తున బన్నీని వరిస్తున్నాయి.
తాజాగా అల్లు అర్జున్ జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికి సంబంధించిన యాడ్ ఇప్పుడు ప్రసారం అవుతుంది. అల్లు అర్జున్ తో పాటు మరో తెలుగు నటుడు సుబ్బరాజు కూడా ఇందులో నటించారు. “మనసు కోరుతే తగ్గేదే లే” అంటూ తన సినిమా డైలాగ్ ని మిక్స్ చేశారు.
జొమాటో మాత్రమే కాదు ఆహా, రాపిడో, శ్రీ చైతన్య కాలేజీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అల్లు అర్జున్. మరిన్ని బ్రాండ్స్ బన్నీ ఖాతాలో చేరనున్నాయి.
మిగతా తెలుగు హీరోలను దాటి పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని బన్నీ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ‘పుష్ప’తో అనుకోకుండా హిందీ మార్కెట్ వచ్చింది. ఒక్కసారిగా అందరి చూపు అల్లు అర్జున్ పై పడింది. ‘పుష్ప’ విడుదలయిన తర్వాత బన్నీకి ఇన్ స్టాగ్రామ్ లో కొత్తగా 10 లక్షల మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు.